నెఫ్రోప్లస్ సమ్మిట్ కిడ్నీ కేర్‌కు ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ అందిస్తుంది

హైదరాబాద్, 9 మార్చి 2022: నెఫ్రోప్లస్, భారతదేశపు అతిపెద్ద డయాలసిస్ కేర్ నెట్‌వర్క్, ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా, 6 మార్చి 2022న, ప్రముఖ నెఫ్రాలజిస్టులు, పరిశ్రమ నిపుణులు, మానసిక ఆరోగ్య న్యాయవాదుల భాగస్వామ్యంతో కిడ్నీ హెల్త్ & డయాలసిస్ కేర్…

Read More

కేవలం సంవత్సరం కాలంలోనే (కోవిడ్ సమయంలో) వందకు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసిన మెడికవర్ హాస్పిటల్స్

ఈ సందర్భంగా నెఫ్రోలజి  విభాగం డైరెక్టర్ ,డాక్టర్  కమల్ కిరణ్  ప్రసంగిస్తూ " గత సంవత్సరం వ్యవధిలో 102 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసాము , నేను 1997 నుండి కిడ్నీ మార్పిడి విభాగంలో ఉన్నాను. నేను బెంగళూరు లో పని చేసే సమయంలో అన్ని హాస్పిటళ్లు కలిసి సంవత్సరానికి 15 నుండి 20 కిడ్నీ  మార్పిడి శస్త్రచికిత్సలు జరిగేవి.  కర్ణాటక రాష్ట్రం మొత్తం మీద బెంగుళూరులో మాత్రమే   ఒకే ఒక డయాలసిస్ కేంద్రం ఉండేది. ఇప్పుడు ప్రతి జిల్లాలో డయాలసిస్ కేంద్రాలు అందరికి అందుబాటులో ఉన్నాయి అన్నారు. 2000 సం " సమయంలో తాను సంవత్సరానికి 15 -20 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ చేసేవాడిననీ, ఇప్పుడు ఏడాదికి 70-100 చేస్తున్నానని అన్నారు . ఈ లెక్క ప్రకారం భారతదేశంలో కనీసం సంవత్సరానికి 10 లక్షల మందికి కిడ్నీ మార్పిడి చేయాల్సివస్తుంది, కానీ గట్టిగా 12000 మాత్రమే చేస్తున్నారు. ఇలా ట్రాన్స్ ప్లాంట్స్ చేయించుకోకపోడం వలన చాలా  మంది మరణిస్తున్నారు.మేము ఇక్కడ మెడికవర్ లో చిన్న వయసు నుంచి పెద్దవయసు వాళ్ళవరకు మనం ఈ యొక్క కిడ్నీ మార్పిడి చేసాం.పక్క రాష్ట్రాల హాస్పిటల్స్ లో  చాలా మంది మేము చేయలేము అన్నవి కూడా మేము ఇక్కడ నిర్వహించి వాళ్ళకి నూతన జీవితాన్ని ఇచ్చాము.పెద్దవాళ్లలో డయాబెటిస్ , కార్డియాలజీ సమస్యలు ఉన్నా మెడికవర్ లో మేము విజయవంతంగా నిర్వహించాం. ప్రజలలో అవగాహన లేకపోవడం , మార్పిడి చేయడానికి సరిపడు అవయవాలు లేకపోవడం ,కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ (కిడ్నీ మార్పిడి) చేయించుకోలేకపోవడానికి గల ముఖ్యకారణాలు .ఈ సమస్యలను అధిగమించడానికి లైవ్ డోనర్ ట్రాన్స్ ప్లాంట్స్ , కేడవేర్  ట్రాన్స్ ప్లాంట్స్ , శ్వాప్   ట్రాన్స్ ప్లాంట్స్ మొదలైనవి  పెరిగుతున్నాయి అన్నారు. డాక్టర్ కెవిఆర్ ప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ గారు మాట్లాడుతూ, “హీమోడయాలసిస్‌పై జీవించడం రోగికి మరియు మొత్తం కుటుంబానికి చాలా కష్టమైన పని. తగిన దాత ఒక వ్యక్తికి నూతన జీవితాన్ని అందించగలడు. చాలా సార్లు సరైన దాత కుటుంబంలో మాత్రమే అందుబాటులో ఉంటారు. కేడవేర్ (శవం) అవయవ దానం పట్ల మరింత అవగాహన అవసరం అని అన్నారు . డాక్టర్ ఏవి రవి కుమార్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ గారు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వందకు పైగా కిడ్నీ మార్పిడి  శస్త్రచికిత్సలు చేసి ఎంతో మందికి వారి యొక్క జీవన శైలి మెరుగుపరిచినాము. కుటుంబం యొక్క తోడ్పాటు మరియు అవగాహనతోనే ఇదంతా సాధ్యపడుతుంది. కిడ్నీ వ్యాధి ప్రాణాంతకమైనది , ముందుగా పసిగట్టడంవల్ల దీని బారినుంచి బయటపడవచ్చు. ఇదంతా అవగాహనతోనే సాధ్యం. అందుకే మనం కిడ్నీ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 10న జరుపుకుంటున్నాం" అని అన్నారు.  ఈ కింది లక్షణాలతో భాధపడుతున్నట్లుయితే  అశ్రద్ధ చేయకండి వెంటనే డాక్టర్ ని సంప్రదించండి  దీర్ఘకాలం  మధుమేహం , మూత్రం ద్వారా ప్రోటీన్ పోవడం, రక్తంలో గ్లూకోస్ తగ్గడం , నియంత్రలేని రక్తపోటు ఉన్నవారు, వంశపారపర్యంగా  కిడ్నీ వ్యాధులు(పోలీసిస్టిక్ కిడ్నీ ) ఉన్నవారు , వాంతులు , విరేచనాలు ,పాముకాటు , మలేరియా , నొప్పి మాత్రలు ఎక్కువ వాడేవారు,  కాళ్ళ చుట్టూ వాపులు , మూత్రం తగ్గటం, రంగు మారడం , ఆయాసం ఆకలి లేకపోవడం , రక్త హీనత , మూత్రంలో శుద్ధ / రక్తకణాలు ఉండటం  , పక్కటెముకలు కిందిభాగంలో నొప్పి , నడుంనొప్పి, తరుచు మూత్రానికి వెళ్లడం , రాత్రిపూట మూత్రవిసర్జన ఎక్కువసార్లు కావడం  ఈ  యొక్క కార్యక్రమం లో సీనియర్  కన్సల్టెంట్  యూరోలాజిస్ట్స్ డా.ఏ వి రవి కుమార్, డా. కె వి అర్ ప్రసాద్ , డా. కౌశిక్ శర్మ  &  నెఫ్రోలోజిస్ట్స్  డా. జె . రంగనాథ్ ,డా.అరుణ్ కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్ , చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ దెగ్లూర్కర్ పాల్గొన్నారు 

Read More

నెఫ్రోప్లస్, IIFL AMC మరియు ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల నుండి 24 మిలియన్ల యుఎస్ డాలర్ల E రౌండ్‌ నిధులను సమీకరించింది

ఆసియాలోని ప్రముఖ డయాలసిస్ నెట్‌వర్క్, నెఫ్రోప్లస్, భారతదేశం అంతటా వృద్ధి అవకాశాలను కొనసాగించడానికి మరియు అంతర్జాతీయ మార్కెట్‌లను ఎంచుకోవడానికి సిరీస్ E రౌండ్ నిధులను ముగించింది. IIFL అసెట్ మేనేజ్‌మెంట్ (IIFL AMC) నేతృత్వంలోని ప్రస్తుత రౌండ్, ఇప్పటికే ఉన్న ఇన్వెస్ట్‌కార్ప్ మరియు బెస్సెమర్ వెంచర్ పార్ట్‌నర్స్ (BVP) నుండి పెట్టుబడితో పాటుగా చెప్పుకోదగ్గ…

Read More