ష్వాబ్ ఫౌండేషన్ & జూబ్లియెంట్ భారతీయ ఫౌండేషన్ ల సోషల్ ఎంట్రప్రెన్యుయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు – ఇండియా 2021 ఫైనలిస్టులుగా నామినేట్ అయిన నలుగురు అమిత ప్రభావపూర్వక ఆంట్రప్రెన్యూర్లు

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క సోదర సంస్థ  అయిన ది ష్వాబ్ ఫౌండేష న్ ఫర్ సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్, జూబ్లియెంట్ భారతీయ గ్రూప్ కు చెందిన లాభాపేక్ష రహిత సంస్థ జూబ్లి యెంట్ భారతీయ ఫౌండేషన్ నేడిక్కడ 12వ సోషల్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (ఎస్ఈఒవై) అవార్డ్ – ఇండియా 2021 ను ఫైనలిస్టులను ప్రక టించాయి.

ఎస్ఈఒవై అవార్డ్ – ఇండియా 2021 కు గాను దిగువ పేర్కొన్న అమిత ప్రభావపూర్వక ఆంట్రప్రెన్యూర్లు ఫైన లిస్టులుగా నామినేట్ అయ్యారు:

  1. అపర్ణ హెగ్డే, అర్మాన్; www.armman.org
  2. సీమా ప్రేమ్, ఎఫ్ఐఏ గ్లోబల్; www.fiaglobal.com
  3. పరాంశు సింఘాల్, కరో సంభవ్; www.karosambhav.com
  4. Dr. శుచిన్ బజాజ్, ఉజాలా సిగ్నస్; www.ujalacygnus.com

పరిశ్రమ ప్రముఖులతో, వివిధ రంగాల ప్రముఖులతో కూడుకున్న జ్యూరీ ప్యానెల్ ఈ అవార్డు కోసం అంతిమ విజేత ను ఎంపిక చేయనుంది.

సోషల్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ – ఇండియా 2021 విజేతను 2021 అక్టోబర్ 7న గురువారం నాడు జ రిగే వర్చువల్ వేడుకలో ప్రకటించనున్నారు. వర్చువల్ గా జరిగే ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రపంచం న లుమూలల నుంచి వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారు. అమిత ప్రభావశీలురైన ఈ వ్యక్తుల విశిష్ట సేవలను వారు ప్రశంసించనున్నారు.

వృద్ధిలోకి వస్తున్న, విజయవంతమైన సోషల్ ఆంట్రప్రెన్యూర్లను గుర్తించడం ఎస్ఈఓవై అవార్డు లక్ష్యం. భారీ స్థాయి లో, వ్యవస్థను మార్చగల నమూనాలతో, వివిధ ప్రాంతాల్లో పలు సవాళ్లను పరిష్కరిస్తూ సమీకృత వృద్ధిలో ఇలాంటి వారు కీలకంగా ఉంటున్నారు. ఎస్ఈఓవై అవార్డు – ఇండియా 2021  విజేత ది ష్వాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఆంట్ర ప్రెన్యూర్ షిప్ కు అనుబంధంగా ఉండే, హై ఇంపాక్ట్ సోషల్ ఎంటర్ ప్రైజెస్ యొక్క అతిపెద్ద నెట్ వర్క్ లో చేరుతారు.

 ఎస్ఈఓవై అవార్డు – ఇండియా 2021  ఫైనలిస్టులు అత్యంత స్ఫూర్తిదాయక పరివర్తనదాయక వ్యక్తులు. పలు రకా ల పరామితుల ఆధారంగా కఠినమైన మదింపుతో వీరు ఎంపికయ్యారు. కొవిడ్ -19 స్పందన, ప్రయత్నాలు, నేపథ్య

పరిశీలన, వ్యక్తిగత, క్షేత్రస్థాయిలో టీమ్ ఇంటరాక్షన్స్, ప్రభావం మదింపు, నిపుణుల సమీక్షలు, రిఫరెన్స్ తనిఖీలు లాంటివి వీటిలో ఉన్నాయి.

ఎంపికైన ఫైనలిస్టులు ప్రసూతి, శిశు ఆరోగ్య సంరక్షణ, చేకూర్పు ఆర్థిక సేవలు, సర్క్యులర్ ఎకానమీ (రీసైక్లింగ్ ఇ-వే స్ట్, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వేస్ట్), బ్యాటరీ వేస్ట్, గ్లాస్ మరియు అణగారిన వర్గాల వారికి అధిక నాణ్యమైన టెర్టియరీ ఆరోగ్య సంరక్షణ సేవలు రంగాల్లో పని చేస్తున్న టెక్ ఎనేబుల్డ్ నిపుణులు.

తమ కార్యకలాపాల్లో సంచలనాత్మక వినూత్నతలను ఉపయోగిస్తున్న ఈ సోషల్ ఆంట్రప్రెన్యూర్స్ సాంకేతికతను వి నూత్నంగా ఉపయోగించడం, ఎక్స్ టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఈఆర్పీ) ఫ్రేమ్ వర్క్ లపై పని చేయడం, ఏఐ పవర్డ్ ఫిన్ టెక్ ప్లాట్ ఫామ్ ను అభివృద్ధి చేయడం, దేశానికి చెందిన ద్వితీయ, తృతీయ స్థాయి పట్టణాల్లో తక్కువ వ్యయంతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అధిక ప్రభావాన్ని క నబర్చగలుగుతున్నారు.

ఎస్ఈఓవై అవార్డు–ఇండియా 2021 మార్చి 2021లో దరఖాస్తులను ఆహ్వానించింది. దేశానికి చెందిన 28 నగరాల నుంచి 100కు పైగా దరఖాస్తులను స్వీకరించింది. వీటిలో మహిళా సోషల్ ఆంట్రప్రెన్యూర్లవి 28 ఉన్నాయి.

ఆరోగ్య సంరక్షణ, క్లీన్ టెక్నాలజీ, మీడియా కమ్యూనికేషన్, డిజెబిలిటీ, ఎనర్జీ, ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్, కార్మి కుల స్థితి గతులు, మైక్రో ఫైనాన్స్, న్యూట్రిషన్, సుస్థిరదాయక సేద్యం, నీళ్లు, పారిశుద్ధ్యం లాంటి విభాగాల నుంచి  ఇవి వచ్చాయి.

ఎస్ఈఓవై అవార్డు – ఇండియా అనేది సోషల్ ఆంట్రప్రెన్యూర్లకు  అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఏడాది ఈ అవార్డు తన 12వ ఏడాదిని వేడుక చేసుకుంటున్నది. సోషల్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (ఎస్ఈఒవై) అవార్డ్ – ఇండియా ద్వారా దేశంలో సోషల్ ఇన్నోవేషన్ కు ప్రాచుర్యం కల్పించేందుకు 2010లో ష్వాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్, జూబ్లియెంట్ భారతీయ ఫౌండేషన్ కలసి ముందుకొచ్చాయి. నాటి నుంచి అలాంటి వాటిని గుర్తించి, దేశంలో సోషల్ ఇన్నోవేషన్ రంగం వృద్ధి చెందేందుకు అండగా నిలిచాయి.

ఫైనలిస్టుల గురించిన క్లుప్త వివరణలు:

డాక్టర్ అపర్ణ హెగ్డే  (armman)

వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ ట్రస్టీ

రంగం: ఆరోగ్య సంరక్షణ

ఏర్పాటు : 2008

                www.armman.org

armman అనేది లాభాపేక్షరహిత సంస్థ. మొదటి ఐదేళ్లలో తల్లి, బిడ్డల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు నిరూపిత ప్రభా వంతో కూడిన తక్కువ వ్యయ, నాన్ – లీనియర్, క్రమశిక్షణాయుత పరిష్కారాలను అందించేందుకు ఇది సాంకేతికత

సాయం తీసుకుంటుంది. armman కార్యక్రమాలు గర్భవతులు / తల్లులకు ఎంతో ముఖ్యమైన వ్యాధి నిరోధక సమా చారాన్ని అందిస్తాయి. ఆరోగ్య కార్యకర్తలు, వ్యవస్థలకు కూడా ఇది సాంకేతికత ఎనేబుల్డ్ సమగ్ర శిక్షణతో అండగా ని లుస్తోంది.

ఇది ‘టెక్ ప్లస్ టచ్’ ధోరణిని అనుసరిస్తోంది. మొబైల్స్ ద్వారా ప్రజల్లోకి బాగా చొచ్చుకెళ్లడం ద్వారా ప్రభుత్వం యొక్క ఆరోగ్య కార్యకర్తల నెట్ వర్క్, దాని భాగస్వామ్య ఎన్జీఓలకు మరింతగా సహకరిస్తోంది. భారత ప్రభుత్వ ఆరోగ్యం, కు టుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఇది ప్రస్తుతం తన ‘కిల్ కారి’ (ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మొబైల్ ఆధారిత మెటర్నల్ మెసేజింగ్ ప్రోగ్రామ్) & ‘మొబైల్ అకాడమీ’ (ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య కార్యకర్తల శిక్షణ కా ర్యక్రమం)ను నిర్వహిస్తోంది. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ / ఎఐ లకు సంబంధించి గూగుల్ ఏఐతో, అదే విధంగా తల్లీ బిడ్డల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు గాను వాట్సాప్ ను ఆరోగ్య వేదికగా ఉపయోగించుకోవడం గురించి టర్న్.ఐఒ తో  కల సి పని చేస్తోంది. ఇది 19 రాష్ట్రాల్లో  25 మిలియన్లకు పైగా మహిళలు, చిన్నారులను, 197,000 మంది ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలను చేరుకుంది. 2030 నాటికి 123 మిలియన్ల మంది మహిళలు, చిన్నారులను, పది లక్షల మం ది ఆరోగ్య కార్యకర్తలను చేరుకోనుంది.

సీమా ప్రేమ్ (ఫియా గ్లోబల్)

సీఈఓ, సహవ్యవస్థాపకురాలు

రంగం: ఆర్థిక సేవలు, సామాజిక చేకూర్పు

స్థాపన: 2012

               www.fiaglobal.com

ఫియా ఒక ప్రభావపూరిత ‘ఫిన్ టెక్’ సంస్థ. దక్షిణాసియాలో తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు మరీ ముఖ్యంగా మ హిళలకు ఆర్థిక సేవలు అందే విధానాన్ని అది పునర్ నిర్వచించింది. ఫియా యొక్క ఏఐ శక్తియుత ఫిన్ టెక్ ప్లాట్ ఫామ్ – ఫిన్ వెస్టా అనేది సాషె ఆర్థిక ఉత్పాదనలను రూపొందించి వాటిని తన బ్యాంకింగ్ ఏజెంట్ల విస్తృత నెట్ వర్క్ ద్వారా గ్రామీణ వినియోగదారులకు అందిస్తుంది. దీని పంపిణి నైపుణ్యం ఆర్థిక సేవలు మరెందరికో చేరుకునేలా చే సింది. ఇతరత్రా సేవలను అందుకోలేకపోయిన వర్గాలకు ఆయా ఫలితాలు దక్కేలా చేసింది. భారతదేశంలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. 

ఫియా నేడు తన చేకూర్పు కేంద్రాల్లో ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. అకౌంట్స్, క్యాష్ ఇన్ / క్యాష్ అవుట్, ఫం డ్ ట్రాన్స్ ఫర్స్ గ్లోబల్ రెమిటన్సెస్, పెట్టుబడులు, బీమా ఉత్పాదనలు, క్రెడిట్, ప్రభుత్వ సబ్సిడీల పంపిణి లాంటివి వీ టిలో ఉన్నాయి. ఈ సేవలు ప్రత్యేకంగా మహిళల కోసం, మహిళల సారథ్యంలో ఉండే సంస్థల కోసం, సాధారణ ఆర్థిక సేవలు దక్కని వారికోసం, మారుమూల ప్రాంతాల వారికోసం రూపొందించబడ్డాయి. ఫియా స్థానిక బ్యాంకింగ్ ఏజెంట్లు ఫియా నుంచి నిరంతర శిక్షణ, వృత్తిపరమైన అభివృద్ధి సేవలు పొందుతారు.

ఫియా అతిపెద్ద గ్రామీణ డిజిటల్ బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటి. 30,000 ఇన్ క్లూజన్ కేంద్రాల ద్వారా 40 మిలియన్ల ఖాతాదారులకు సేవలందిస్తోంది. భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్ లలో 100 కోట్లకుపైగా ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించడం దీని లక్ష్యం.

ప్రాంశు సింఘాల్ (కరో సంభవ్)

వ్యవస్థాపకులు

రంగం: వ్యర్థాల నిర్వహణ

స్థాపన: 2016

                 www.karosambhav.com

కరో సంభవ్ అనేది ఒక సోషల్ ఎంటర్ ప్రైజ్. ప్రజలకు రీసైక్లింగ్ ను ఒక జీవన విధానంగా చేయడం దీని లక్ష్యం. ఇ-వేస్ట్, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వేస్ట్, బ్యాటరీ వేస్ట్, గ్లాస్ వేస్ట్ లాంటివి దీని పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకూ పెద్దగా పట్టిం చుకోని మ్యాట్రెసెస్, టెక్స్ టైల్స్, టైర్లు వంటి వాటిపై కూడా ఇది దృష్టి పెట్టింది. ‘సర్క్యులర్ ఎకానమీ’, ‘ఎక్స్ టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ’ (ఈపీఆర్) ఫ్రేమ్ వర్క్ లపై ఇది అగ్రగామి ఎంటర్ ప్రైజెస్, వ్యూహాత్మక భాగస్వా ములు, ప్రభుత్వాలతో ఇది కలసి పని చేస్తోంది. లోతైన సాంకేతిక నైపుణ్యం, క్షేత్రస్థాయి కార్యాచరణ, సాంకేతికత, సిస్టమ్స్ థిం కింగ్ అప్రోచ్ వంటి తన కీలక శక్తులను సమాజంపై ప్రభావం కనబరిచేందుకు వినియోగిస్తోంది.  

సేకరణ భాగస్వాములుగా అసంఘటిత రంగాన్ని ఈపీఆర్ ప్రోగ్రామ్ లతో విజయవంతంగా మిళితం చేయడం అనేది ఇందులో ముఖ్యమైన భావన. ఫలితంగా 200 కు పైగా వ్యాపారాలు వృద్ధి చెందాయి. ఉమ్మడిగా అవి 8.2 మిలియ న్ డాలర్ల మేరకు ఆదాయం సాధించాయి. ఇది ఉపాధి అవకాశాల కల్పనలో కొత్త పుంతలు తొక్కింది. గత నాలుగే ళ్లలో కరో సంభవ్ 23,000 మెట్రిక్ టన్నుల మేరకు ఇ-వేస్ట్, ప్లాస్టిక్స్ వేస్ట్ లను సేకరించింది. 21,100 మెట్రిక్ ట న్నుల కర్బన ఉద్గారాలను నిరోధించింది. 3,000కు పైగా పాఠశాలలు, 500కు పైగా సంస్థలతో క్షేత్రస్థాయిలో అవగా హ న కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా 29 రాష్ట్రాల్లో 60 నగరాల్లో ఇది నేరుగా 30 లక్షల మంది ప్రజలతో కలసి పని చేస్తోంది.

Dr. శుచిన్ బజాజ్ (ఉజాలా సిగ్నస్ హెల్త్ కేర్ సర్వీసెస్)

వ్యవస్థాపక డైరెక్టర్

రంగం: ఆరోగ్య సంరక్షణ

స్థాపన: 2011

www.ujalacygnus.com

అత్యంత నిరుపేదల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చే లక్ష్యంతో ఉజాలా సిగ్నస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్  రూపుదిద్దుకుంది. అందుబాటు ధరలకే సాధారణ ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆరోగ్య సంరక్షణను అందించడం దీని లక్ష్యం. దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు సైతం సూపర్ స్పెషాలిటీ టెర్టియరీ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను అందించాలన్నది దీని లక్ష్యం. దీనికి తోడుగా ఇది ఉచిత మందులను కూడా అందిస్తోంది. పేదవారికి ఫార్మసీ, కన్సల్టెన్సీ, సర్జరీలపై డిస్కౌంట్లు అందిస్తోంది.  వివిధ ఆరోగ్య అంశాలపై ఇది అవగాహన శిబిరాల ను కూడా నిర్వహిస్తోంది. సుస్థిర దాయక ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించేందుకు ఇది వైద్య నిపుణులతో ఇ తర మెడికల్ ప్రాక్టీషనర్లకు సిఎంఇ (కంటిన్యుయస్ మెడికల్ ఎడ్యుకేషన్) కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఇ ప్పటి వరకూ 4000 కు పైగా కార్యక్రమాలను నిర్వహించింది. సుమారు 50వేల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా రు.

ప్రస్తుతం ఇది దేశంలో నాలుగు రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో ఉనికి కలిగిఉంది. ప్రతి రోజు ఉజలా హాస్పిటల్స్ 70 సర్జరీలు చేస్తున్నాయి. 650 మందికి కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నాయి. సగటున రోజుకు 200 మందిని చేర్చుకుంటున్నా యి. సమీప భవిష్యత్ లో తన ఉనికిని ఐదు రాష్ట్రాలకు విస్తరించాలని భావిస్తోంది.

సంపాదకులకు గమనిక:

ష్వాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ అనేది హిల్డె ష్వాబ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన ప్రొఫెసర్ క్లాజ్ ష్వాబ్ ల చే ఏర్పాటు చేయబడింది. ప్రపంచ అగ్రగామి సోషల్ ఇన్నోవేటర్స్   సామాజిక, సుస్థిరదాయక ప్రపంచాన్ని సృష్టించడంలో ఇరవై ఏళ్లుగా ష్వాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ వారికి అండగా నిలుస్తూ వచ్చింది. సుస్థిరదాయక సామాజిక వినూత్నతల అధునాతన అగ్రగామి మోడల్స్ ను ప్రదర్శించేందుకు రీజనల్, అంతర్జాతీయ స్థాయి స్థాయిలో తిరుగులేని వేదికలను ష్వాబ్ ఫౌండేషన్ కల్పిస్తోంది.

Learn more at www.schwabfound.org and follow on:

Twitter: https://twitter.com/schwabfound ;

Facebook: https://www.facebook.com/schwabfound/

LinkedIn: https://www.linkedin.com/company/schwab-foundation-for-social-entrepreneurship

జూబ్లియంట్ భారతీయ ఫౌండేషన్ (జేబీఎఫ్) 2007 లో నెలకొల్పబడింది. ఇది జూబ్లియంట్ భారతీయ గ్రూప్ యొక్క లాభాపేక్ష రహిత సంస్థ. గ్రూప్ కు చెందిన కార్పొరెట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల రూపకల్పన, అమలులపై ఇది దృష్టి పెడుతుంది. సామాజిక అభివృద్ధి పనులు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల ని ర్వహణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, వృత్తి శిక్షణ, మహిళాసాధికారికత, విద్యాత్మక కార్యక్రమాలు, సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ కు ప్రాచుర్యం కల్పించడం లాంటివి జూబ్లియంట్ భారతీయ ఫౌండేషన్ కార్యకలాలపాల్లో ఉన్నాయి. www.jubilantbhartiafoundation.com

Learn more at www.jubilantbhartiafoundation.com and follow on:

Twitter: https://twitter.com/indiaseoy ;

Facebook: https://www.facebook.com/IndiaSEOY

LinkedIn: https://in.linkedin.com/company/jubilantbhartiafoundation