పుట్టిన రోజు జేజేలు

బ్నిం గారి గురించి రాయటమంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే ఆయన్ని దగ్గర నుంచి చూసాను..ప్రతిభ అనే పదానికి డిక్షనరీలో ఏదైనా ఒక అర్దం పొందుపరిస్తే దానికి పర్యాయపరంగా ఈయన్ని చేర్చాలి అంటాను. ఎందుకంటే ఆయన ఓ కార్టూనిస్ట్ అంటే కుదరదు.ఓ కథకుడు అంటే నడవదు…ఒక చట్రంలో ఇమిడే వ్యక్తిత్వం కాదు.ప్రతిభ అంతకన్నా కాదు. ఆయన బేసిగ్గా, కార్టన్ లు ఇష్టుడు, బాపుగారికి భక్తుడు, స్నేహితుడు, రమణగారి రచనా శైలి అందిపుచ్చుకున్న వారు, బాపు గారిలా బొమ్మలు గీసేస్తారు.

అదే చేత్తో డాన్స్ బాలేలు రాస్తారు. గ్యాప్ లో  అలవోకగా టీవిలకు స్క్రిప్టు రాసేస్తారు..అవార్డ్ లు అందేసుకుంటారు.లేటెస్ట్ సినిమాల గురించి మాట్లాడతారు..తనపై తానే జోక్ వేసుకుంటారు.   ఈ లోగా ఎవరో సన్మాన పత్రం అంటూ వస్తే మధ్యలో  ఓ పదినిముషాలు టైమ్ కేటాయిస్తారు. కాలక్షేపంగా కథలు రాసారు. అవి నచ్చేసి పత్రికలు వాళ్లు వెంటబడి కథలు రాయించేసుకుంటారు. రాత మధ్యలో స్నేహితులతో ముచ్చట్లు. సరదాలు,జోక్స్. అసలు ఓ మనిషి ఇన్ని ఎలా చేయగలరు..ఇలాంటి వ్యక్తి గురించి ఇది అని ఏం  రాయగలం.  ఓ చిన్న ఆర్టికల్ లో ఆకాశమంత ఆయన ప్రతిభను ఇమడ్చటం. చాలా కష్టమైన పని. కాబట్టి హాయిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు అని ఓ ముక్కలో చెప్పేయటం బెస్ట్. 
సార్ బ్నిం గారూ మీరు ఇలాగే మరిన్ని సంవత్సరాలు పాటు పుట్టిన రోజులు మా అందరి చేతా జరిపించుకుంటూ ఉండాలి.  

ఇట్లు మీ అభిమాన సంఘం ప్రెసిడెంట్