..ఈ ప్లే బాయ్ మోడల్ ఏమి చేసిందో తెలుసా?

Image Courtesy : Instagram

ఆ మధ్యన వచ్చిన బాలీవుడ్ చిత్రం ఎంటర్టైన్మెంట్ లో …ఓ  పాత్ర ఆస్ది మొత్తం తన కుక్కకు రాసేస్తుంది. అవన్నీ సినిమాలోనే జరుగుతాయి. నిజ జీవితంలో ఎవరు చూస్తారు అనుకుంటున్నారా..సినిమావాళ్లు నిజ జీవితాల నుంచే కథలు రాసుకుంటున్నారు. అవును దాదాపు అలాంటి సంఘటనే ఈ మధ్యన ఒకటి జరిగింది.

కొంతమంది జంతు ప్రేమికులు తమ పెంపుడు కుక్కలు, పిల్లులకు సకల భోగాలు కల్పించారని వింటూంటాం. వాళ్లు తాము పెంచుకునే కుక్కలకు తమతో పాటు సమానంగా అన్ని సౌకర్యాలు సమకూర్చుతారు. ఇంట్లో ప్రత్యేకంగా బెడ్స్ ఇలా అన్ని అందిస్తారు. ఆ మధ్యన  ఓ జంతు ప్రేమికుడు ఒక అడుగు ముందుకువేసి తనతో పాటు తన కుక్క ప్రయాణించేందుకు ఏకంగా విమానంలోని మొత్తం బిజినెస్ క్లాస్‌నే బుక్ చేశాడు.  ఆ కుక్క ముంబయి నుంచి చెన్నైకి బిజినెస్ క్లాస్‌లో విలాసంగా వచ్చింది. అవన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం మరో ఎత్తు. కుక్కకు ఏకంగా 15 కోట్లు విలువైన ఆస్దినే రాసేసింది ఒకావిడ. ఆవిడ మరెవరో కాదు.. ప్రముఖ ప్లే బోయ్ మోడల్ జు ఐసన్.

జు ఐసన్  తను పెంచుకుంటున్న పెంపుడు కుక్కకు తాను సంపాదించుకున్న 2 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.15 కోట్లు ఆస్తి రాసి ఇచ్చింది. ఇంతకీ ఆ ప్లే బాయ్ మోడల్ కుక్కకి అంత ఆస్తి రాసివ్వడానికి కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు. ఈ విషయమై ఆమె చెప్పిన సమాధానం ఏమంటే…  తనకు పిల్లలు ఎవరూ లేరని, కుక్కలంటే తనకి చాలా ఇష్టమని , అందుకే తను పెంచుకుంటున్న కుక్కకే తన ఆస్తిని ఇచ్చేయాలని అనుకుంటున్నాను అని తెలిపింది.ఒకవేళ తను చనిపోతే తన కుక్కని ఎవరు చూసుకుంటారు అని, అదే ఆస్తి రాసిస్తే దాని కేర్ టేకర్ బాగా చూసుకుంటాడు అని తెలిపింది. అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నామని, భవిష్యత్ గురించి ముందు చూపు లేకుండా బతికేయకూడదనే ఐసన్ పేర్కొంది.

అనుకున్నదే తడువుగా కొంత మంది లాయర్లను కలిసింది.పూచ్ ఫ్రాన్సిస్కో లోని తన అపార్ట్మెంట్, కార్లను కూడా ఆ కుక్కకే రాసిచేస్తానని తెలిపింది.ఇది వినగానే ఆశ్చర్యపోయిన లాయర్లు కుక్కకి ఆస్తి రాసివ్వడమేంటి అని అడిగారు. తన ఇష్టం అని సింపుల్ గా చెప్పింది. ఆ కుక్క ..ఇప్పుడు రాజభోగాలు అనుభవిస్తోంది. ఆమెతో పాటు ప్రైవేట్ జెట్లో కూడా విహరిస్తోంది. ఐసన్ పెంచుకుంటున్న కుక్క ఆమెతో పాటు విలాస వంతమైన జీవితాన్ని గడుపుతుంది.పేరుకే కుక్క కానీ రకరకాల స్టైలిష్ దుస్తులు వేస్తూ వయ్యారంగా తిరుగుతూ మిగతా కుక్కలకి సైతం ఈర్ష్య పుట్టిస్తుంది.అయితే పిల్లలు లేరని ఆస్తులు రాసి ఇచ్చే బదులు బాయ్ ఫ్రెండ్ తో కలిసి పిల్లలని కనచ్చు గా  అని అభిమానులు అడిగిన ప్రశ్నకు పిల్లలను కనే టైం లేదని సమాధానమిచ్చింది జూ ఐసన్.

ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటే ఇదే కాబోలు. ఈ వార్త వినగానే  ఆ ఆస్తి ఏదో మాకు రాసి ఇచ్చిన బాగుండేది , అంత మొత్తాన్ని కుక్కకి బదులు మాకు రాసి ఇచ్చినా కుక్కలా పడుంటాము అందామనుకుంటున్నారా.