ఈ పుస్తకం కొనాలంటే ఎనిమిదిన్నర లక్షలు కావాలి,ఉన్నాయా?

అంత రేటు పెట్టి కొనుక్కోవాల్సిన పుస్తకం ఏమిటా…అంత గొప్పతనం ఏముంటుంది..అసలా పుస్తకం దేనిగురించి అంటూ ఆలోచనలో పడిపోకండి. ఈ కంటెంట్ అంతా పుస్తకం డాట్ గురించి. ఈ డొమైన్ మీ సొంతం చేసుకోవాలంటే ఈ రేటు పెట్టాల్సిందన్నమాట. పుస్తకం డాట్ కామ్ ని మీరు అంత రేటు పెట్టి బుక్ చేసుకుంటే ఏ కంటెంట్ పెట్టాలి..పెడతారు అనే అనిపిస్తోందా. ఏముంది..డొమైన్ నేమ్ లోనే అంతా ఉంది. పుస్తకాలు గురించే ఈ డొమైన్ లో పెట్టాలి. వేరేవి పెడితే ఊరుకోరా అంటే ఊరుకుంటారు. కానీ వేరే కంటెంట్ ఉంటే జనం ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అంత రేటు పెట్టి ఎవరు కొంటారు అంటారా..

ఇప్పుడు రోజులు మారాయి. ఎవరైనా ఏదైనా బిజినెస్ చేస్తున్నారు లేదా మొదలెడుతున్నారు అంటే…  బిజినెస్ చిన్నదా? పెద్దదా? అనే వ్యత్యాసం లేకుండా  కచ్చితంగా ఆన్‌లైన్‌లోనే ఆ బిజినెస్ గురించి అందరికీ తెలిసేలా చూసుకోవాలనుకుంటున్నారు. అందుకే బిజినెస్ కోసం ప్రత్యేకమైన వెబ్‌సైట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సొంత వెబ్‌సైట్ కలిగి ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు.  అలాంటివాళ్లు పుస్తకాల వ్యాపారంలోకి దిగినా లేదా  పుస్తకాల గురించి రాయాలనుకున్నా, ప్రపంచ పుస్తక మార్కెట్ గురించి విశ్లేషణలు చేయాలన్నా ఇలాంటి సైట్ ఒకటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడు ఈ సైట్ ని కొనటానికి ముందుకు రావచ్చు.

అయితే పుస్తకాలకు మార్కెట్ తగ్గుతున్న ఈ సిట్యువేషన్ లో పుస్తకం డాట్ కామ్ కు ఆ రేటు పలకటం మాత్రం ఆశ్చర్యం. అయితే కాదీదీ మార్కెట్ లో అమ్మడానికి అనర్హం అన్నట్లుగా కార్పోరేట్ కంపెనీలు ముందుకు వెళ్తున్నాయి. వినియోగదారులు ఒక్కోసారి ఉత్సాహం చూపిస్తున్నారు. చూడాలి మరి ఈ డాట్ కామ్ ని ఎవరు సొంతం చేసుకుంటారో..అందులో ఏ కంటెంట్ పెడతారో..తెలుగువాళ్లు తీసుకుంటే మనకు పుస్తకాల గురించి మరోసైట్ దొరుకుతుందనటంలో మాత్రం సందేహం లేదు. చూద్దాం. భవిష్యత్ పుస్తకం లో ఏం రాసుందో.

గమనిక: ఇక్కడ మీరు చదివిన సమాచారం కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే . teluguapp.com కు గాని మా అనుబంద సంస్థలకి గాని ఇక్కడ ప్రస్తావించిన డొమైన్ కు ఏ సంబంధం లేదు. అలాగే ఆ డొమైన్ పేరు ను కొనుక్కుని కానీ, వద్దు కానీ చెప్పబోవటం లేదు. అది మీరు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం.