‘ఆహా’…ఏమి బహుమానం

ఓటీటిల మధ్య పోటీ పెరిగిపోయింది. ముఖ్యంగా తెలుగులో అమేజాన్, నెట్ ప్లిక్స్ , ఆహా ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. దాంతో కొత్త కొత్త పోగ్రామ్ లు, సినిమాలతో మార్కెట్ ని ఎవరికి వారే గ్రాబ్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం రకరకాలు స్కీమ్ లు  వేస్తున్నారు. బాలయ్య వంటి సెలబ్రెటీలను సీన్ లోకి తెస్తున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. అయినా మిడిల్ క్లాస్ కన్సూమర్ ని ఆకట్టుకోవటానికి తమ సబ్ స్కైబర్ గా చేర్చుకోవటానికి వారికి నచ్చే వోచర్ లు, బహుమతులు అంటూ ఆశపెడుతున్నారు. ఇలాంటి వాటిల్లో ఆహా ముందుంది.

వంద శాతం తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహా. తెలుగు లోగిళ్లలో డిజిటల్‌ స్పేస్‌లో అచ్చమైన వినోదానికి అసలు సిసలు కేరాఫ్ గా ఆహా స్దిరపడాలనుకుంటోంది‌. ఈ క్రమంలో 299 రూపాయలతో  రెన్యూవ్ చేస్కోండి, అద్భుతమైన గిఫ్ట్స్ సొంతం చేస్కోండి అంటూ ఓ స్కీమ్ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 31 వరకూ ఈ గిప్ట్ ఆఫర్ వర్తించనుంది.  AHA299 కోడ్ వాడి సబ్ స్కైబ్ చేస్తే వన్ ప్లస్ టీవీ కానీ మొబైల్ ఫోన్ కానీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికీ సబ్ స్కైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి మరి.

ఇక అంతులేని ప్రేమ, అంతులేని వినోదం అనే నినాదంతో తెలుగు లోగిళ్లలో అంతులేని ఆనందాన్ని నింపుతున్న ఆహా ఈ ఏడాది తమ ప్రేక్షకుల కోసం క్రాక్‌, లెవన్త్ హవర్‌, జాంబీ రెడ్డి, చావు కబురు చల్లగా, నాంది, ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌, నీడ, కాలా, ఆహా భోజనంబు, ఒన్‌, సూపర్‌డీలక్స్, చతుర్ముఖం, కుడి ఎడమైతే, తరగతి గదిదాటి, ది బేకర్‌ అండ్‌ ద బ్యూటీ, మహా గణేశ, పరిణయం, ఒరే బామ్మర్ది, కోల్డ్ కేస్‌, ఇచట వాహనములు నిలపరాదు వంటి సినిమాలు, హిట్‌ షోస్‌ని ప్రెజెంట్‌ చేయడం గమనార్హం.