సినీ ఆత్మీయుల సమక్షంలో ‘నిజంగా నేనేనా’ నవలా ఆవిష్కరణ

శ్రీను పాండ్రంకి నవలా రచయిత, సినీ దర్శకుడు. అతడు ఇంగ్లీష్ లో రాసిన క్రైమ్ మిస్టరీ నవల X² ఇది వరకే విడుదలయ్యి సక్సెస్  కాగా ఇప్పుడు తెలుగులో కొన్ని నవలలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఆయన ఇప్పటి వరకు ముప్పైకి పైగా షార్ట్ ఫిల్మ్స్ కు దర్శకత్వం వహించారు. చాలా చిత్రాలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమయ్యాయి, అవార్డ్స్ గెలుచుకున్నాయి. ఆయన దర్శకత్వం వహించిన పీకాబూ, స్టెల్లా చిత్రాలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కాగా లక్ష్మీ మంచు తో నిర్మించిన డెసిషన్ షార్ట్ ఫిల్మ్ జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. ఆయన తాజాగా నిజంగా నేనేనా అనే నవల రాసారు. ఆ నవల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని బఫెల్లో వైల్డ్ వింగ్స్ లో జరిగింది.

ముఖ్య అతిధులుగా ప్రముఖ దర్శకులు వి.ఎన్.ఆదిత్య గారు వేదికను అలంకరించారు. ఈ కార్యక్రమంలో రచయితలు లక్ష్మీ భూపాల, రవి రెడ్డి మల్లు, సురేంద్ర కృష్ణ, విశ్వనేత్ర, మునీంద్ర, సూర్య ప్రకాష్ జోస్యుల… నటులు వంశీ చాగంటి, కార్తీక్ రాజు, భార్గవ రామ్ తో పాటు దర్శకులు సాయి రాజేష్ (హృదయ కాలేయం), భరత్ కమ్మ (డియర్ కామ్రేడ్), శరన్ కొప్పిశెట్టి (తిమ్మరుసు), రమణ గోపిశెట్టి (తత్వమసి), ప్రశాంత్ అట్లూరి (అహం), అమర్ కామేపల్లి (బ్రేక్ అప్), ఆనంద్ రవి (నెపోలియన్), అర్జున్ సాయి (ఉత్సవం), సతీష్ కార్తికేయ (వారధి), నాగు గవర (వీకెండ్ లవ్), శ్రీనివాస్ రవీంద్ర (ద్వారక), హరనాథ్ బాబు(నువ్వు తోపురా), శ్రీనివాస్ కాకర్ల మరియు పాటల రచయితలు చక్రవర్తులు, వినీల్ కాంతి కుమార్ పాల్గొన్నారు.

అందరూ మాట్లాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసి, నవల పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. శ్రీను పాండ్రంకి మాట్లాడుతూ తన మొదటి ఇంగ్లీష్ నవల X² ని ఆదరించినట్టే తన మొదటి తెలుగు నవల ‘నిజంగా నేనేనా’ ని ఆదరిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ త్వరలో మరిన్ని నవలలు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.